Michael Vaughan: రోహిత్ ప్లేస్‌లో ఇంకొకరుంటే..జట్టు నుంచి తప్పించేవారు 3 d ago

ఐపీఎల్ 2025 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రోహిత్ పై కఠిన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఇవే పరుగులు వేరే ఆటగాడు చేసి ఉంటే.. జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. అద్భుతమైన ఆటగాడి నుంచి ఈ ప్రదర్శన సరికాదని అభిప్రాయపడ్డాడు. అతడు కచ్చితంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశాడు. ముంబయి తరపున కచ్చితంగా పెద్ద స్కోర్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.